తరచుగా అడిగిన ప్రశ్నలు

సెక్టార్ సంబంధించి

సెక్టార్ సంబంధించి ప్రత్యేకమైన ప్రోగ్రాములు ఎందుకు?

ఒక ఫౌండర్ కు ఆ సెక్టార్ లో ఎదురయ్యే కొన్ని సవాళ్లకు అనుగుణంగా సెక్టార్ సంబంధించి ప్రత్యేకమైన ప్రీ సీడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ లో బాగా ఫోకస్ గా ఉన్న నిపుణుల సెషన్లను అందించడంతో పాటు, సంబంధిత కస్టమర్ సమావేశాలను ఏర్పాటు చేసి మరియు ప్రతి సెక్టార్ లోని ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఖచ్చితమైన ప్రయోజనాలను అందించే విధంగా ఉంటుంది.

నేను ఏయే సెక్టార్లకు అప్లై చేయవచ్చు?

Atoms 4.0 AI మరియు Bharat కోసం అప్లికేషన్లను స్వీకరిస్తోంది.

నేను ఈ సెక్టార్ ల పరిధిలోకి రాకపోతే, నేను Accel Atomలకు అప్లై చేయవచ్చా?

Accel Atoms కు అప్లై చేసుకోవడానికి అన్ని సెక్టార్ల స్టార్టప్ లకు స్వాగతం. Atoms 4.0 లో AI మరియు Bharat లో స్టార్టప్ ల కోసం చూస్తున్నప్పటికీ, మీరు ఈ 2 థీమ్ లలో ఒకదానికి చెందనట్లయితే, మీ అప్లికేషన్ Accel లోని సరైన సభ్యులకు పంపబడుతుంది. Accel అనేది సెక్టార్-పరిమితం కాని విసి సంస్థ.

ప్రోగ్రామ్ స్ట్రక్చర్

ఈ కోహోర్ట్(గ్రూపు) ఏ విధంగా ఉంటుంది మరియు ఎంత కాలం ఉంటుంది?

ప్రతి కోహోర్ట్ దాని ప్రోగ్రామ్ షెడ్యూల్లో ప్రత్యేకంగా ఉంటుంది, ఎందుకంటే అవి వేర్వేరు సెక్టార్లపై దృష్టి పెడతాయి మరియు Accel వేర్వేరు పార్టనర్లచే నడుపబడతాయి. మరింత సమాచారం కొరకు దయచేసి కోహోర్ట్ పేజీలను చూడండి.

నేను Accel Atoms కి నేను ఎలా అప్లై చేసుకోవాలి?

Accel Atoms అప్లై చేసుకోవడానికి మంచి మార్గం మా వెబ్సైట్. దీని కోసం మా వద్ద ప్రత్యేకమైన టీం ఉన్నది మరియు అన్ని ఆటోమేటెడ్ గా జరిగిపోతాయి, ఎలాంటి అప్లికేషన్లు మిస్ అవ్వగుండా చూసుకుంటుంది.

ఎన్ని స్టార్టప్ లను ఎంపిక చేస్తారు?

Accel Atoms యొక్క ఈ ఎడిషన్ లో ప్రతి గ్రూపులో 5-10 కంపెనీలు ఉండాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ లో అత్యధిక వృద్ధి చెందిన స్టార్టప్ లు 1 మిలియన్ డాలర్ల పెట్టుబడికి అర్హులు అవుతారు.

నేను ఏ సౌకర్యాలను పొందగలను?

Accel కుటుంబంలో భాగంగా, కంపెనీలు మా నెట్ వర్క్ పార్టనర్ ల నుండి $ 5 మిలియన్ కంటే ఎక్కువ విలువైన 70+ ప్రయోజనాలను పొందుతాయి.

Accel Atoms ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటి?

కమ్యూనిటీ: మీకు మార్గనిర్దేశం చేయడానికి 300+ స్టార్టప్ ఫౌండర్లు, 100+ ఏంజెల్ ఇన్వెస్టర్లు మరియు ఇండస్ట్రీ నిపుణులతో కూడిన Accel యొక్క నెట్వర్క్కు యాక్సెస్ పొందండి.

కస్టమర్: ఎంటర్ ప్రైజ్ మరియు ఎండ్-కస్టమర్ అంతటా మీ మొదటి కస్టమర్ లను కనుగొనడానికి Accel దోహదపడుతుంది. యాక్సెల్ యొక్క 200+ స్టార్టప్ ల పోర్ట్ ఫోలియోతో నెట్ వర్క్ చేయండి, ఇండస్ట్రీ పరిచయాలను ప్రారంభించండి మరియు మీ ఆలోచనను పొందడానికి ప్లేబుక్ లకు యాక్సెస్ పొందండి.

1:1 మెంటార్ షిప్: AI మరియు భారత్ లో పరిశ్రమ నిపుణులతో మాస్టర్ క్లాస్, కోహోర్ట్ వ్యవస్థాపకుల సహకారంతో రూపొందించిన కస్టమైజ్డ్ టేక్ అవేస్ & గ్రోత్ ప్లాన్.

అర్హతా ప్రమాణాలు

Accel Atoms లో అప్లై చేయడానికి నా కంపెనీ ఏ దశలో ఉండాలి?

2 మిలియన్ డాలర్ల లోపు ఫండింగ్ పొందిన ప్రీ సీడ్ దశలో ఉన్న కంపెనీలకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. మునుపటి గ్రూపులలో, మేము ఇంకా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్న మరియు ప్రొడక్ట్ కంటే ముందు దశలో ఉన్న కంపెనీలతో సహా అన్ని దశలలో ఉన్నవాటికి పెట్టుబడులు పెట్టాము. Atoms 4.0 లో అన్ని దశల్లో ఉన్న కంపెనీలకు మేము మద్దతు ఇస్తూనే ఉంటాము.

అప్లై చేసుకోవాలంటే నా ఆలోచన ఏ స్టేజిలో ఉండాలి?

మొదలు పెడదామని ఆలోచించే స్టేజ్ నుంచి 1 మిలియన్ డాలర్ల వరకు ఆదాయాన్ని ఆర్జించే స్టార్టప్ లు అన్నింటికీ Accel Atoms ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది

MVP తో సంబంధం లేకుండా, తమ కంపెనీని పూర్తిస్థాయిలో నిర్మించడానికి కట్టుబడి ఉన్న ఫౌండర్లతో వారి మంచి ఆలోచనల ప్రారంభ దశలలో పెట్టుబడి పెట్టడానికి కూడా మేము ఎదురుచూస్తున్నాము.

నేను సోలో ఫౌండర్ ని. నేను అప్లై చేయవచ్చా?

అవును, మీరు సోలో ఫౌండర్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. Atoms పెట్టుబడులు పెట్టిన సోలో ఫౌండర్లలో ఉన్న కొన్ని కంపెనీలలో బ్రిక్, రిపిక్ మరియు స్కోబ్ కూడా ఉన్నాయి.

అంతర్జాతీయంగా పాల్గొనడం అనుమతించబడుతుండా?

AI కోహోర్ట్ కోసం, మేము భారతదేశానికి చెందిన ఫౌండర్లు మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో ఉన్న భారత సంతతి ఫౌండర్ల నుండి అప్లికేషన్లను స్వీకరిస్తున్నాము. భారత్ కోహోర్ట్ కోసం, మేము భారతదేశానికి చెందిన ఫౌండర్ల నుండి మాత్రమే అప్లికేషన్లను స్వీకరిస్తున్నాము.

ఫండింగ్

Atoms క్యాపిటల్ లో ఎంత వరకు పెట్టుబడి పెడతారు?

ఈ ప్రోగ్రామ్ లో అత్యధిక వృద్ధి సాధించిన స్టార్టప్ లలో మేము 1 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెడతాము. మరింత ఎదగాలనుకునే కంపెనీల కోసం, మేము వాటిని Atoms వెలుపల Accel పెట్టుబడులలో పరిగణనలోకి తీసుకుంటాము.

నిధులు గ్రాంటుగా లేదా ఈక్విటీ పెట్టుబడిగా అందిస్తారా?

ప్రోగ్రామ్ చివర్లో ఈక్విటీ లేదా కన్వర్టబుల్ నోట్ రూపంలో 1 మిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేస్తారు.

Atoms కి అంగీకరించడం అనేది Accel నుండి పెట్టుబడికి ఫాలో అవ్వడాన్ని సూచిస్తుందా?

1 మిలియన్ డాలర్ల పెట్టుబడి, నెట్ వర్క్ అందించే సౌకర్యాలతో ఫౌండర్లను 0 నుంచి 1కి తీసుకెళ్లేలా రూపొందించారు. మేము మా గ్రూపులలోని స్టార్టప్ ల వృద్ధిని నిరంతరం అంచనా వేస్తాము మరియు వాటి కార్యాచరణ బట్టి, వాటిని ఫాలో ఆన్ రౌండ్ల కోసం పరిగణనలోకి తీసుకుంటాము లేదా ఇతర పెట్టుబడిదారులను కలవడానికి అవకాశాలను అందిస్తాము.